Home South Zone Andhra Pradesh ఫిల్దర్ఫియా ఏజీ చర్చ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్

ఫిల్దర్ఫియా ఏజీ చర్చ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్

0

ఫిల‌దెల్ఫియా ఎ.జి చ‌ర్చ్ ను సంద‌ర్శించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్
రెవ‌. చార్లెస్ పి.జాక‌బ్ కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

విజ‌య‌వాడ : ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం సితార సెంట‌ర్ వ‌ద్ద వున్న ఫిల‌దెల్ఫియా ఎ.జి చ‌ర్చ్ ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ సోమ‌వారం సంద‌ర్శించారు. చ‌ర్చ్ కు విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు పుష్ప‌గుచ్ఛం అందించి రెవ‌. చార్లెస్ పి.జాక‌బ్, రెవ‌.డా.ఫిలిప్ పి.జాక‌బ్ ఆత్మీయంగా స్వాగ‌తం ప‌లికారు.

“సమాజంలో శాంతి, ఐక్యత, సేవా భావాన్ని పెంపొందించడంలో చర్చిల పాత్ర ఎంతో కీలకమైనది. ఫిలడెల్ఫియా ఎ.జి చర్చ్ చేస్తున్న సేవలు అభినందనీయం. రానున్న నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలి” అంటూ రెవ. చార్లెస్ పి. జాకబ్‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫిలడెల్ఫియా ఎ.జి చర్చ్ చేపట్టే సేవా కార్యక్రమాలకు త‌న స‌హ‌కారం వుంటుంద‌న్నారు.

“ప్రజా ప్రతినిధిగా ఎంపీ కేశినేని శివనాథ్ అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ, సామాజిక ఐక్యతకు కృషి చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి” అంటూ రెవ‌. చార్లెస్ పి.జాక‌బ్ ఆకాంక్షించారు. అనంతరం రెవ. చార్లెస్ పి. జాకబ్‌తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో క్రిస్టియ‌న్ నాయ‌కులు ఇత్త‌డి చార్లెస్, చాట్ల రాజశేఖ‌ర్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, ఎన్.ఐ.ఆర్.డి ఎన్టీఆర్ జిల్లా అర్బ‌న్ కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహా చౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి రేగ‌ళ్ల ల‌క్ష్మ‌ణారావు, గొల్ల‌పూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మ‌న్ పాల మాధ‌వ‌.

శాప్ డైరెక్ట‌ర్ సంతోష్ కుమార్, రాష్ట్ర న‌గ‌రాల కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ బేవ‌ర సాయి సుధాక‌ర్, నియోజ‌క‌వ‌ర్గ ఎస్సీ సెల్, తెలుగు యువ‌త, ఐటిడిపి అధ్య‌క్షులు పైడిమాల సుభాషిణి, ఆర్.మాధ‌వ‌, ఎమ్.చైత‌న్య‌, నియోజ‌క‌వ‌ర్గ మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ సుభానీ, క్ల‌స్ట‌ర్ ఇన్చార్జ్ సుబ్బారెడ్డి , 45వ డివిజ‌న్ ప్రెసిడెంట్ పేరం స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ సుభానీ, డివిజ‌న్ సీనియ‌ర్ నాయ‌కులు మైల‌వ‌ర‌పు కృష్ణ‌, పూల కాంతారావు డివిజ‌న్ అధ్య‌క్షులు చిన్న సుబ్బ‌య్య‌, బ‌డుగు వెంక‌న్న‌, కుంచం దుర్గారావు ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version