కర్నూలు : కర్నూలు జిల్లా…• ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 101 ఫిర్యాదులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన ..
జిల్లా ఎస్పీ.కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 101 ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) కోడుకులు చూసుకోవడం లేదని న్యాయం చేయాలని కర్నూలు , కల్లూరు కు చెందిన బి. అయ్యప్ప ఫిర్యాదు చేశారు.
2) లోన్ అమౌంట్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని కర్నూలు, క్రిష్ణానగర్ కు చెందిన వినయ్ బాబు ఫిర్యాదు చేశారు.
3) హైదరాబాద్ క్లారీ ఫాక్స్ టెక్నాలజీ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి హంపి అనే వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశాడని చర్యలు తీసుకోవాలని కర్నూలు , లక్ష్మీ టౌన్ షిప్ కు చెందిన చరణ్ రాజ్ ఫిర్యాదు చేశారు.
4) బంగారం తాకట్టు పెట్టింది ఇవ్వడం లేదని వారి పై చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు కు చెందిన అబ్దల్ ఫిర్యాదు చేశారు.
5) డబ్బులు తీసుకొని భూమిని రిజి స్ట్రేషన్ చేసి ఇవ్వడం లేదని కర్నూలు , వెల్దుర్తి మండలం, రత్న పల్లి గ్రామం కు చెందిన బోయ రవి కుమార్ ఫిర్యాదు చేశారు.
6) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నీకోలస్ అనే వ్యక్తి రూ. 2 లక్షల 40 వేలు తీసుకోని మోసం చేశాడని చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా, నందికోట్కూరు సాయి చరిత ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి.
బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సిఐలు శివశంకర్, శ్రీనివాస నాయక్, రామయ్య నాయుడు లు పాల్గొన్నారు.
