Home South Zone Andhra Pradesh సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి మాజీ ఎంపీ కంభంపాటి పరామర్శ

సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి మాజీ ఎంపీ కంభంపాటి పరామర్శ

0

మచిలీపట్నం డిసెంబర్ 28: ———–

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం పెద్దవుటుపల్లిలోనీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు.

ఇటీవలే మాతృమూర్తిని కోల్పోయిన కంభంపాటిని ముఖ్యమంత్రి పరామర్శించారు.

కంభంపాటి రామ్మోహన్ రావు మాతృమూర్తి వెంకట నరసమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రద్ధాంజలి ఘటించారు.

కంభంపాటి కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ,
అదనపు ఎస్పీ సత్యనారాయణ, ఆర్డిఓ గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, ప్రత్యేక భద్రతాధికారి శాంతి కుమారు, ఇంటలిజెన్స్ ఇన్చార్జి డిఎస్పి వెంకటేశ్వరరావు, గన్నవరం డిఎస్పి శ్రీనివాసరావు, సహాయ ఆహార తనిఖీ అధికారి సిహెచ్ గోపాలకృష్ణ, సిపిడిసిఎల్ ఈ ఈ హరిబాబు, ఉంగుటూరు తహసిల్దార్ విమల కుమారి, ఎంపీడీవో సత్య కుమారు తదితర అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version