Home South Zone Andhra Pradesh 2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..

2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..

0

2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే.. ఏపీలో క్రైమ్ రేట్ చాలా తగ్గిందని వెల్లడించారు. మహిళలకు రక్షణ, మత్తు పదార్థాల రవాణా, సెల్‌ఫోన్లు రికవరీ.. వంటి అనేక వాటిలో పురోగతి సాధించామన్నారు డీజీపీ. కొత్త ఏడాదిలో నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వచ్చే పది సంవత్సరాలలో పోలీసింగ్ ఎలా ఉంటుందనే దాని మీద రెండు రోజులు వర్క్‌షాపు నిర్వహిస్తామని డీజీపీ హరీశ్ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా పోలీసు విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలా అందిపుచ్చుకోవాలో వివరిస్తామన్నారు. సంక్రాంతి తర్వాత ఈ వర్క్‌షాపు ఉంటుందన్నారు. ఇటీవల కీలక కేసులను ప్రస్తావించడంతోపాటుగా.. ఎలా చేధించారో వివరిస్తామన్నారు.

‘సరికొత్త పోలీసింగ్ కనిపించేలా ఈ వర్క్ షాపు ద్వారా అందరికీ తెలియజేస్తాం. చట్టానికి అందరూ సమానమే. వ్యతిరేకంగా వెళ్లేవారిపై చర్యలు ఉంటాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిపై చర్యలు తీసుకోవడమే మా విధి. సేఫ్ ఏరియా అనుకుని కొందరు నక్సలైట్లు ఏపీలోకి వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వారందరినీ పట్టుకున్నాం.’ అని డీజీపీ హరీశ్ కుమార్ తెలిపారు.

సైబర్ నేరాల గురించి డీజీపీ మాట్లాడారు. చైనాలో పెద్ద గ్యాంగ్స్ ఉన్నాయన్నారు. మోసం జరిగిన వెంటనే.. ఆ దేశానికి నగదు వెళ్లిపోతుందన్నారు. ఇటువంటి కేసుల్లో నగదు తిరిగి రావడం అనేది కష్టమైన పని, ఈ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేంద్రం నివేదికలో 36వ స్థానంలో ఏపీ ఉందనే వార్తల్లో వాస్తవం లేదని డీజీపీ అన్నారు. ఎందుకంటే అది పాత సిస్టమ్ అని, వారి డేటాకు, మన డేటాకు మధ్య తేడా వల్ల అలా వచ్చిందని తెలిపారు. ఇప్పుడు చూస్తే డ్యాష్‌ బోర్డులో ఏపీ ఎక్కడ ఉందో తెలుస్తుందన్నారు.

మహిళలకు రక్షణ, గంజాయి రవాణ, నేరాల నియంత్రణకు ఏపీ పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నామని డీజీపీ తెలిపారు. తాము ఎప్పుడు మహిళలకు రక్షణగానే ఉంటామని, అన్ని ఘటనలనూ జనరలైజ్ చేసి చూడకూడదని చెప్పారు. ‘పేకాట క్లబ్‌లు నిర్వహించడం నేరం. అందుకే చర్యలు తీసుకుంటున్నాం. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని జూదాలు నిర్వహించకూడదు.’ అని డీజీపీ అన్నారు.

నిందితులను రోడ్లపై నడిపించిన వ్యవహారంపై డీజీపీ హరీశ్ కుమార్ స్పందించారు. కోర్టులో హాజరుపరిచే సమయానికి పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో లేవన్నారు. ఈ కారణంగా కొన్ని చోట్ల నిందితులను నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉండాలనే లక్ష్యంతో పోలీసులు పని చేస్తున్నట్టుగా వెల్లడించారు.

NO COMMENTS

Exit mobile version