రేపు అనగా సోమవారం(29-12-2025)ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు క్రింది కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని శ్రీయుత జిల్లా కలెక్టర్ డా ||వి. వినోద్ కుమార్,ఐ.ఏ.ఎస్ గారు తెలియజేసి ఉన్నారు.
బాపట్ల:
జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రతి మండల స్థాయిలోని రెవెన్యూ కార్యాలయాలు రెపల్లె మరియు చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు
కావున, ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా,తమకు సమీపంలోని మండల రెవెన్యూ కార్యాలయం లేదా రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని వినియోగించుకొని తమ సమస్యలపై అర్జీలు సమర్పించుకోవాలని వినమ్రంగా కోరడమైనది.
అలాగే, అర్జీదారులు తమ అర్జీలను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చు.
https://meekosam.ap.gov.in
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివోవి డాట్ ఇన్)
అర్జీల నమోదు, నమోదు చేసిన అర్జీల స్థితి తదితర వివరాలు తెలుసుకోవాలంటే
1100 (డబుల్ వన్ డబుల్ జీరో) టోల్ ఫ్రీ నంబర్‌కు నేరుగా కాల్ చేయవచ్చని కూడా జిల్లా కలెక్టర్ గారు తెలియజేసి ఉన్నారు.
ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది
#నరేంద్ర




