Home South Zone Andhra Pradesh తిరుమల సేవలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం|

తిరుమల సేవలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం|

0

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దివ్యదర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి, స్వామివారి అనుగ్రహంతో ఈ పవిత్ర రోజున ప్రత్యేక దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే అత్యంత పవిత్రమైన రోజుగా వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.

కోటి పుణ్యాలకు నెలవైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా వేకువజామున కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సద్గుణాలు, ఆధ్యాత్మిక ఉత్సాహం నిండి ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నానని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు అలంకరణ, ఇతర భక్తులకు సౌకర్యాలు, చాలా ప్రత్యేకంగా చేశారని, తిరుమల అధికారులకు, పాలక మండలికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు!

NO COMMENTS

Exit mobile version