గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్ద గుడి నందు గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు జరిగిన
దశావతార కళ్యాణ మహోత్సవములు ఆదివారంతో తొమ్మిది రోజులు పాటు జరిగిన సందర్భంగా గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ కంచర్ల ఆంజనేయులు మాట్లాడుతూ ఆలయం నిర్మించిన నాటి నుంచి నేటి వరకు ఎంతో గొప్పగా ఘనంగా ప్రతి సంవత్సరము ఈ దశావతారాలు కల్యాణాలు జరుగుతున్నాయని తెలియజేశారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ దశావతారాలు కల్యాణాలు నిర్వహించడం జరిగాయని అన్నారు.ఈ కళ్యాణంలో పాల్గొన్న దంపతులకు స్వామి వారి శేష వస్త్రము అమ్మవారి చీర,అలాగే వేద పండితులు
ఆశీర్వచనం తో పాటు స్వామివారి అన్న ప్రసాద వితరణ గొప్పగా నిర్వహించడం జరిగిందని అన్నారు . ఆలయంలో రాష్ట్రంలో అతి కొద్ది ప్రాంతాల్లోనే జరిగేటువంటి దశావతారాలు కల్యాణాలు మన దేవాలయంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది దశావతారాలు కళ్యాణాలు లో అత్యధిక సంఖ్యలో దంపతులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 30వ తేదీన ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం వేకువ జామున నాలుగు గంటల నుంచి స్వామివారి దర్శనము అలాగే స్వామి వారి దర్శనం అనంతరం బంగారు దక్షిణావృత శంకుతో తీర్థము
అందించడం జరుగుతుంది అలాగే అదే రోజు ఆలయంలో వివిధ రకాల సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పములతో ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించడం జరుగుతుందని తెలియజేశారు అలాగే ఆంగ్లనామ సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటవ తేదీన స్వామివారికి ప్రత్యేక పులాలంకరణ 14వ తేదీ భోగి పండుగ రోజున దేవాలయంలో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణము మరియు 15వ తేదీ మకర సంక్రాంతి పర్వదినమున స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం చందనాలంకరణము
అదే రోజు సాయంత్రం 6 గంటలకు మకరజ్యోతి దివ్య దర్శనంతో పాటు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో ఉంటాయని తెలియజేయడం జరిగింది అన్ని కార్యక్రమాలలో పరిసర గ్రామస్తులు గుంటూరు గ్రామస్తులు గుంటూరు నగరవాసులు అందరూ కూడా రాష్ట్రంలో నుంచి పలు ప్రాంతాల నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గోరంట్ల మాజీ సర్పంచ్ యర్రంశెట్టి వేణుగోపాల్ (వేణు) ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
