Home South Zone Telangana గ్రామాభివృద్ధికి విద్యే పునాది |

గ్రామాభివృద్ధికి విద్యే పునాది |

0

చెరువు ముందు తండ సర్పంచ్ ముందడుగు

మహబూబాబాద్ జిల్లా:

కొత్తగూడ, (భారత్ అవాజ్): కొత్తగూడ మండలం చెరువు ముందు తండ *గ్రామ సర్పంచ్ ఈసం సరిత శోభన్* ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. దోరవారివేంపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సర్పంచ్ స్వయంగా పంపిణీ చేశారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల భవిష్యత్‌ భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, విద్యతోనే గ్రామం అభివృద్ధి చెందుతుందని సర్పంచ్ ఈ సందర్భంగా అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో

ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని మరింత బలపరుస్తాయని గ్రామస్థులు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సువర్ణపాక కృష్ణ , ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, అంగన్వాడి టీచర్ భారతి విద్యార్థులు , విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని సర్పంచ్‌ను అభినందించారు.

NO COMMENTS

Exit mobile version