గుంటూరు జిల్లా పోలీస్…
ప్రజలకు సత్వర న్యాయం అందే విధంగా చేయడమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యొక్క ప్రధాన ఉద్దేశ్యం.” — జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోనీ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (Public Grievances Redressal System – PGRS) కార్యక్రమంలో పాల్గొని జిల్లా ప్రజల నుండి వచ్చిన వివిధ ఫిర్యాదులను స్వీకరించిన గౌరవ ఎస్పీ గారు, ఇతర పోలీస్ అధికారులు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు …* * సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్ట పరమైన పరిష్కారం చూపాలని అన్ని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. * ప్రజల అర్జీలు పునరావృతం కాకుండా, ఒక్కసారి వచ్చిన ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారించి, చట్ట పరిధిలో పరిష్కారం చూపేవిధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. *
ప్రజల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, బాధితులకు పోలీసు శాఖ ఒక భరోసా నింపే సంస్థగా నిలవాలి అని ఎస్పీ గారు సూచించారు. * ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరచే దిశగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు.
ఈరోజు జరిగిన కార్యక్రమంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక వివాదాలు, ఇతర పలు వ్యక్తిగత మరియు సామాజిక సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ గారు మరియు సంబంధిత పోలీసు అధికారులు స్వీకరించి, వాటిపై తగిన చర్యలు చేపట్టారు.
జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని, వారి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ(అడ్మిన్) శ్రీ GV రమణమూర్తి గారు, డిఎస్పీలు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు(ఈస్ట్), శ్రీ అరవింద్ గారు(వెస్ట్), శ్రీమతి భానోదయ గారు(సౌత్), PGRS సీఐ బిలాలుద్దిన్ గారు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
