Home South Zone Andhra Pradesh తాడికొండ గ్రామంలో పీడబ్ల్యూఎస్  పథకం విస్తరణ జరుగుతోంది

తాడికొండ గ్రామంలో పీడబ్ల్యూఎస్  పథకం విస్తరణ జరుగుతోంది

0

తాడికొండ మండలం తాడికొండ గ్రామంలో పీడబ్ల్యూఎస్ (పి డబ్ల్యూ ఎస్ ) పథకం విస్తరణ జరుగుతోందని గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి తెలిపారు. తాడికొండ మండలం తాడికొండ గ్రామానికి సంబంధించి “తాగునీరు ఇచ్చేవారే లేరా..?” శీర్షికన ఒక దిన పత్రికలో శనివారం ప్రచురితమైన వార్తపై కళ్యాణ చక్రవర్తి స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తాడికొండ గ్రామం సీపీడబ్ల్యూఎస్ (సిపిడబ్ల్యూ ఎస్ ) పథకం పరిధిలో ఉందన్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న 41 హ్యాండ్‌ పంపులు పనిచేస్తున్నాయన్నారు. తాడికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని తాడికొండ నివాసానికి శత శాతం ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్ల (ఎఫ్ హెచ్ టి సి ఎస్ ) ద్వారా తాగునీరు (డి డబ్ల్యూ ఎఫ్ ) సరఫరా చేయడం లక్ష్యంగా రూ.10 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే 20 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.

తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ఉన్న తాడికొండ, మరో 6 నివాసాలకు సంబంధించిన సీపీడబ్ల్యూఎస్ (సీపీ డబ్ల్యూ ఎస్ ) పథకానికి ప్రత్యేక మరమ్మతులను రూ.71.60 లక్షలుతో కూడా చేపట్టామని అన్నారు. తాడికొండ గ్రామంలోని భూగర్భ జలాలు ఉప్పుగా (బ్రాకిష్) ఉండటంతో పాటు గాఢత (హార్డ్నెస్) ఎక్కువగా ఉండి, కనీసం గృహ అవసరాలకూ ఉపయోగపడే స్థితిలో లేవని వివరించారు. అందువల్ల గ్రామం ప్రధానంగా “తాడికొండ మరియు మరో 6 నివాసాలకు సీపీడబ్ల్యూఎస్ పథకం” మీదే ఆధారపడుతోందని వివరించారు.

తాడికొండ గ్రామంలో పాత పబ్లిక్ వాటర్ సప్లై (పి డబ్ల్యూ ఎస్ ) పథకం గత 15 ఏళ్లుగా పనిచేయడం లేదని, పథకానికి సంబంధించిన ఇన్‌టేక్ వెల్, ఫిల్టర్ బెడ్స్ వంటి మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిని చాలా కాలంగా వినియోగంలో లేవని చెప్పారు. గ్రామంలో మొత్తం రోజువారీ నీటి అవసరం 910 కిలోలీటర్లు (కె ఎల్ ) కాగా, ప్రస్తుతం సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా రోజుకు 790 కిలోలీటర్లు నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పీడబ్ల్యూఎస్ పథకం పనిచేయకపోవడంతో దానికి మరమ్మతులు, మెరుగుదలలు అవసరం ఉందన్నారు.

గ్రామంలోని 500 కిలోలీటర్లు సామర్థ్యమున్న ఎలివేటెడ్ జీఎల్‌బీఆర్ (జి ఎల్ బి ఆర్ ) నుండి అన్ని ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు నీటిని విడుదల చేసే సమయంలో, ప్రస్తుత పంపిణీ వ్యవస్థ కారణంగా మొత్తం గ్రామానికి ఒకేసారి సరఫరా చేయడం సాధ్యం కాకపోవడంతో గ్రామ పంచాయతీ ప్రత్యామ్నాయ రోజుల విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ కారణంగా సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా నీటి సరఫరాను మరింత పెంచడం కష్టమవుతోందని పేర్కొన్నారు.

సీపీడబ్ల్యూఎస్ పథకంలోని ఏసీ (ఏసీ) పైపులతో కూడిన గ్రావిటీ మెయిన్ చాలా పాతదైపోయిందని,  నెక్కళ్ళు, అనంతవరం ప్రాంతాల్లో సీఆర్‌డీఏ పనుల సమయంలో తరచుగా పైపుల లీకేజీలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెలలో అనంతవరం – నెక్కళ్ళు గ్రామాల మధ్య ఉన్న 250 మి.మీ. వ్యాసం గల ఏసీ పైపులో 6 లీకేజీలు సంభవించాయన్నారు. గ్రామానికి నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా, ఈ లీకేజీలను ఒక్క రోజులోనే సరి చేశామని తెలిపారు.

హెడ్‌వర్క్స్ వద్ద, ముడి నీటి ఇన్‌టేక్ వెల్ వద్ద ఉన్న పంప్‌సెట్లు కూడా చాలా పాతవైపోయి, తక్కువ డిశ్చార్జ్ ఇస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.10.00 లక్షలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ఉన్న తాడికొండ మరియు మరో 6 నివాసాలకు సంబంధించిన సీపీడబ్ల్యూఎస్ పథకంలో పాత, దెబ్బతిన్న పంప్‌సెట్లు, పైపులైన్లను మార్చి, నీటి సరఫరా నిరంతరంగా జరిగేలా ప్రత్యేక మరమ్మతు పనులు చేపట్టామన్నారు. అదేవిధంగా, జల్ జీవన్ మిషన్ నిధుల కింద తాడికొండ గ్రామంలో కింది పనులకు అనుమతి మంజూరైందిన్నారు.

హైస్కూల్ వెనుక భాగంలోని హౌసింగ్ లేఅవుట్‌కు పీడబ్ల్యూఎస్, ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్లు (ఎఫ్ హెచ్ టి సి ఎస్ ) ఏర్పాటు చేయుటకు రూ.47.13 లక్షలు
అంచనా వ్యయంతో నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. పనులు 70 శాతం పూర్తి అయిందన్నారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగిస్తూ, రెట్రోఫిట్టింగ్ ద్వారా తాడికొండ గ్రామంలో ఎఫ్.హెచ్.టి.సి ఏర్పాటుకు రూ.2.70 కోట్ల .

అంచనా వ్యయంతో పనులు మంజూరు కాగా 70 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పంపిణీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తూ రెండు జోన్లను (జోన్ –1 & జోన్ –2) ప్రతిపాదించామన్నారు.
బందరుపల్లి మేజర్ వద్ద కొత్త నీటి మూలాన్ని ఏర్పాటు చేసి, 12.80 కి.మీ పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు. జోన్–1ను ఎన్ఎస్ కాలువ (ఎన్ ఎస్ కెనాల్) నీటి మూలం ద్వారా కవర్ చేయడం జరుగుతుందని, జోన్–2 – సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా, ఎలాంటి అంతరాయం

లేకుండా మొత్తం గ్రామానికి నీటి సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామానికి అదనపు నీటి వసతుల అవసరం కావడంతో, అక్కాదేవత చెరువును నిల్వ (స్టోరేజ్) చేయుటకు ఉపయోగించి మొత్తం గ్రామ అవసరాలను తీర్చడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. పనులు పూర్తై నిధులు అందిన వెంటనే, మొత్తం గ్రామానికి ఒక నెలలోపు పూర్తిస్థాయి నీటి సరఫరా అందించడం జరుగుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో 1.00 ఎంఎల్‌డీ సామర్థ్యం గల మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేశారని.

అలాగే 2,300 రన్నింగ్ మీటర్ల (Rm) పొడవు గల పంపింగ్ మెయిన్‌ను ఏర్పాటు చేసి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న 120 కె ఎల్ ఓహెచ్‌ఎస్‌ఆర్ వినియోగానికి అనుసంధానం చేశారని, హౌసింగ్ లేఅవుట్‌లో పంపిణీ లైన్లు కూడా వేశారని చెప్పారు.
బందరుపల్లి మేజర్ నుండి తాడికొండ గ్రామంలో ఉన్న 55 ట్యాంక్ వరకు మొత్తం 12,800 ఆర్.ఎం లో 12,000 ఆర్.ఎం పొడవు గల పంపింగ్ మెయిన్ ఏర్పాటు చేశారన్నారు. ఈ పనిలో బీసీ కాలనీకి పంపిణీ లైన్లు వేసి, 380 ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్లు (ఎఫ్ హెచ్ టి సి ఎస్ ) ఏర్పాటు చేశారన్నారు.

80 కె.ఎల్ సామర్థ్యం గల సంప్ కమ్ పంప్ హౌస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు.
ఈ పనికి అవసరమైన పైపులను ఇప్పటికే కొనుగోలు చేసి, ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా, హిల్ రోడ్ ప్రాంతంలో పైపులు వేసేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. ఈ పథకం పరిధిలో ఉన్న అన్ని నివాసాల్లో తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు, వివిధ ప్రాంతాల్లో మోటార్లను త్వరలోనే కొనుగోలు చేయనున్నామని చెప్పారు. అన్ని పనులు కలిపి మొత్తం రూ.3.89 కోట్లతో చేపట్టడం జరుగుతోందని వివరించారు.

NO COMMENTS

Exit mobile version