Home South Zone Andhra Pradesh లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం

లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం

0

కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సరియా మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి మాట్లాడుతూ ఈ సమావేశమునకు 8 – కొత్త స్కాన్ సెంటర్ల రిజిస్ట్రేషన్,14 రెన్యువల్ రిజిస్ట్రేషన్, 2- ఏ ఆర్ టి, 1- సరోగసి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ఈ సెంటర్లను తను మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు సందర్శించి, తనిఖీ చేసి ఆమోదం కోసం మీటింగ్లో పెట్టడం జరిగిందని తెలియజేసినారు. సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు, 3వ అడిషనల్ డిస్టిక్ జడ్జి మరియు 2- వ జిల్లా ఎడిషనల్ జడ్జ్ ఇంచార్జ్ మాట్లాడుతూ ఫిబ్రవరి మీటింగులో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్రొత్త స్కానింగ్ సెంటర్లను సందర్శిస్తానని తెలియజేసినారు.

కలెక్టర్ మాట్లాడుతూ చట్టం ఉల్లంఘన జరగకుండా చూడవలసిన బాధ్యత, జిల్లా అధికారులపై ఉందని, ఈ సమావేశమునకు వచ్చిన దరఖాస్తులను ఆమోదిస్తున్నట్టు తెలియజేసినారు. ఈ సమావేశము నందు కమిటీ సభ్యులు డాక్టర్ ఎ శ్రావణ్ బాబు జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి, డాక్టర్ అనిత ప్రగతి ఐవిఎఫ్ యూనిట్, అరుణ ఐద్వా ఎన్జీవో, ప్రసూన పిడి ఐసిడిఎస్, శ్రీనివాసరెడ్డి డి.ఎస్.పి మహిళ పోలీస్ స్టేషన్, ఫణి రాజేంద్ర,సీడ్స్, ఎన్ వెంకటేశ్వర్లు డిప్యూటీ డెమో, ఇస్మాయిల్ హెల్త్ ఎడ్యూకేటర్, వాణి,మానిటరింగ్ కన్సల్టెంట్ పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version