*విజయవాడ నగరపాలక సంస్థ*
*31-12-2025*
పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం మిథిలా నగర్, విద్యాధరపురం, పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఆ ప్రాంతాల్లో గల పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పింఛను వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి, ప్రతినెలా ఇస్తున్న పింఛను తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నూతన సంవత్సరం పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే పింఛను పంపిణీ చేస్తున్నారని అన్నారు.
సిబ్బంది ఉదయం ఆరింటికల్లా పింఛను పంపిణీ మొదలుపెట్టరని, పింఛను పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పింఛను లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛను అందిస్తున్నారని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోగల సర్కిల్ 1 పరిధిలో 18,476 పెన్షన్లు, సర్కిల్ 2 పరిధిలో 23,396, సర్కిల్ 3 పరిధిలో 18,268 పెన్షన్లు ఉన్నాయని, వారందరికీ సిబ్బంది సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తదుపరి ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డు వద్ద గల అన్న కాంటీన్ పరిశీలించారు. అక్కడ వచ్చిన ప్రజలతో మాట్లాడి స్వయంగా ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు, త్రాగునీరు, వాడుక నీరు నిరంతరాయంగా రావాలన్నారు.
నోడల్ ఆఫీసర్లు అందరూ తమ తమ అన్న క్యాంటీన్లోని ప్రతిరోజు వీక్షించి ఎటువంటి లోపాలు ఉన్న వెంటనే సరి చేయాలని, ఎటువంటి రిపేర్లు ఉన్న వెంటనే మరమ్మతులు చేయించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారాలను ఆదేశించారు.
ఈ పర్యటనలో కమిషనర్ తో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు
