అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. మదనపల్లె జిల్లా బోర్డును రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన ఆయన, తూర్పు మగసాల వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
లబ్ధిదారులకు నగదు సక్రమంగా అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాము, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సిఐ సుబ్బారాయుడు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
