Home South Zone Andhra Pradesh పెన్షన్‌దార్ల కోసం నూతన సంవత్సర వేడుకలు – మద్దులూరి మాలకొండయ్య|

పెన్షన్‌దార్ల కోసం నూతన సంవత్సర వేడుకలు – మద్దులూరి మాలకొండయ్య|

0

పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. చీరాల: రాష్ట్రంలో ఎన్టీఆర్‌ సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు అన్నారు

, చీరాల మండలం  ఓడరేవు గ్రామం, వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం పంచాయితీ తుఫాన్ పేటలో ఆయన కూటమి నాయకులతో కలిసి ఎన్టీఆర్‌ సామాజిక పెన్షన్లను  అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందన.

, అయితే జనవరి 1వ తేదీన జరిగాల్సిన పంపిణీ నూతన సంవత్సరం సెలవు కారణంగా ఒక రోజు ముందుగానే అర్హులకు పెన్షన్లు అందించడం జరుగుతోందన్నారు. కొత్తగా మంజూరైన పెన్షన్లును అర్హులకు ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతోందన్నారు. కాగా ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా ప్రతి నెలా ఖచ్చితంగా ఒకటవ తేదీనే పెన్షన్లను అర్హుల ఇళ్ల వద్దకే వెళ్లి అందిచడం జరుగుతోందన్నారు. గడిచిన 18నెలల్లో ఇప్పటివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద 677 మందికి రూ.6.58కోట్ల సాయం అందించామని, చీరాల చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని అన్నారు.

ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పారదర్శకతకు నిదర్శనమన్నారు. గతంలో సీఎం ఆర్‌ ఎఫ్‌  చెక్కు కోసం ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేదన్నారు. గత వైసిపి హయాంలో ఒక్కటంటే ఒక్క చెక్కు ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version