ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్న విజయవాడ ట్రాఫిక్ పోలీస్::
విజయవాడ కనకదుర్గ వారధి మరియు నేతాజీ బ్రిడ్జి వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తలిఖీలు చేయడం జరిగింది. విజయవాడ నగర కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఉత్తర్వుల మేరకు న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని యువత హద్దుల్లో ఉండాలని. మందు తాగి వాహనం నడిపితే చట్టపర మైన చర్యలు తీసుకుంటామని. ఆయన అన్నారు.
ఎటువంటి ర్యాలీలకు పర్మిషన్లు ఇవ్వలేదని. ద్విచక్ర వాహనదారులు సైలెన్సర్లు లేకుండా శబ్ద కాలుష్యం చేస్తే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ బందర్ రోడ్డు మరియు బెంజ్ సర్కిల్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు
