గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117 కారణంగా పేద విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని, అందుకే దానిని రద్దు చేశామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. ‘వన్ క్లాస్ – వన్ టీచర్’ విధానాన్ని 3% నుండి 33%కి పెంచామని తెలిపారు.
వచ్చే ఏడాది పాఠశాలల మౌలిక సదుపాయాల కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని బడులను 5-స్టార్ రేటింగ్ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
