గుంటూరు జనవరి 3: సంవత్సర సందర్భంగా పూల బొకేల సంస్కృతికి స్వస్తి పలికి, ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల కోసం అవసరమైన పుస్తకాలు, సామగ్రి ఇవ్వాలని గుంటూరు
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గారు పిలుపునిచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు, అనధికారులు అందించిన సుమారు రూ.2 లక్షల విలువైన పుస్తకాలు మరియు
సామగ్రిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల పిల్లలకు పంపిణీ చేయాలని సూచిస్తూ, సాంఘిక సంక్షేమ శాఖకు కలెక్టర్ అందజేశారు.
