గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన కొరకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు రోడ్డు నందు సింగిల్ నంబర్ ఆట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ బృందం వారికి వచ్చిన సమాచారాన్ని SB CI గారికి తెలియపరచి, ఆయన ఆదేశాల మేరకు రైడ్ నిర్వహించి, సింగిల్ నంబర్ లాటరీ ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 3 సెల్ ఫోన్లను, 19 లాటరీ పుస్తకాలను సీజ్ చేసి, రూ.5,110/- నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం లాలాపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
జిల్లాలో పేకాట, సింగిల్ నంబర్ లాటరీ, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, కోడిపందాలు, వ్యభిచారం వంటి చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
