గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఘన స్వాగతం పలికి, అనంతరం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం, రెడ్డిపాలెం నుండి స్వర్ణ భారతి నగర్ వరకు ర్యాలీలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసినవి:
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,48వ డివిజన్ పరిధిలోని,రెడ్డిపాలెం నందు రూ.10.99 కోట్ల వ్యయంతో పూర్తయిన 22 పనుల
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవములు .
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,46వ డివిజన్ పరిధిలోని రూ.29.75 కోట్ల వ్యయంతో పూర్తయిన 127 పనుల శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవములు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,47వ డివిజన్ పరిధిలోని రూ.8.11 కోట్ల వ్యయంతో పూర్తయిన 28 పనుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవములు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,41వ డివిజన్, స్వర్ణ భారతి నగర్ నందు గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన రూ.48 కోట్ల వ్యయంతో 4.25 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ – 3 పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,41 వ డివిజన్,స్వర్ణ భారతి నగర్,శిల్పారామం నందు జరిగిన బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీ కోవెలమూడి రవీంద్ర గారు,గుంటూరు తూర్పు శాసనసభ్యులు శ్రీ మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు, గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు శ్రీమతి గళ్ళా మాధవి గారు,గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా గారు, గుంటూరు నగర పాలక సంస్థ శ్రీ కమిషనర్ పులి శ్రీనివాసులు గారు,లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు,శ్రీ డేగల ప్రభాకర్ గారు, పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్పొరేటర్లు,రాష్ట్ర జిల్లా,మండల,గ్రామ,స్థాయి నాయకులు,అభిమానులు,కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.
