Home South Zone Andhra Pradesh ఆరు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు.

ఆరు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు.

0

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ ఫేజ్ శంకుస్థాపనతో పశ్చిమ ప్రజలకు ట్రాఫిక్ భారంనుండి విముక్తి : ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి అకుంఠిత దీక్షతో పట్టలెక్కిన ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ ఫేజ్ పనులు
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ ఫేజ్ శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ…
ఆరు సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ ఫేజ్ పనులకు నేడు శంకుస్థాపన జరగడం ఎంతో ఆనందకరమని, ఈ కీలక అభివృద్ధి కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ శాఖామాత్యులు నారాయణ గారికి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి భారీ జనసందోహంతో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలందరికీ పేరుపేరునా నమస్కారం తెలియజేశారు.

ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పత్తిపాడు ప్రాంత అభివృద్ధికి సంబంధించినదిగా కనిపించినప్పటికీ, సమీప నియోజకవర్గమైన గుంటూరు పశ్చిమతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా మారనుందని స్పష్టం చేశారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉన్న ప్రాంతమని, నిత్యం భారీ వాహనాలు, టిప్పర్లు తిరగడం వల్ల ట్రాఫిక్ సమస్య ప్రజలకు పెద్ద భారంగా మారిందని గుర్తు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తయితే ఈ ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గి, ప్రజలకు పెద్ద ఊరట కలుగుతుందని తెలిపారు.
అడిగిన వెంటనే నిధులు సమకూర్చి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్న మంత్రి నారాయణ గారికి, అకుంఠిత దీక్షతో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు జీవం పోసిన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే అభివృద్ధి కార్యక్రమాల సాధనలో నిరంతరం కృషి చేస్తున్న రామాంజనేయులు గారి పాత్రను కూడా ఈ సందర్భంగా కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కేవలం ఒక సంవత్సరంలోనే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నామని, ప్రజల కళ్లకు కట్టినట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.

ఈ అభివృద్ధి ప్రయాణానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ భావనతో ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నందుకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version