సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
బాపట్ల: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సూర్యలంక బీచ్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా బీచ్ వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతులు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. సూర్యలంక బీచ్‌కు పెరుగుతున్న పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక హంగులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనుల జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి త్వరతగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
#Narendra
