తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి వేటపాలెం నుండి చీరాల వైపు నడిచి వెళుతున్న క్రమంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పాపను గుర్తించి చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ అప్పగించడం జరిగింది.
చీరాల: అయోమయంగా వీధులలో తిరుగుతున్న ఒక మైనర్ బాలికను చీరాల వన్ టౌన్ పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.శనివారం పట్టాభి సంయుక్త అనే మైనర్ బాలిక వీధుల్లో గమ్యం లేకుండా తిరుగుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు అప్పగించగా మహిళా పోలీసులు ఆమె నుండి వివరాలు రాబట్టి తిమ్మసముద్రంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే వారు పోలీస్ స్టేషన్ కు రాగా సిఐ సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బాలికను వారికి అప్పగించారు.దీంతో తల్లిదండ్రులు సీఐ సుబ్బారావుకు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు
#Narendra
