Home South Zone Andhra Pradesh పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద 25 టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత |

పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద 25 టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత |

0

రేపల్లె మండలం పెనుమూడి చెకపోస్ట్ దగ్గర వేమూరు నుండి కృష్ణ జిల్లా వెళ్తున్న లారిలో 25 టన్నుల  అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు…ఇంకా పూర్తి వివరాలు తెలియలిసి ఉంది…

బాపట్ల: బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో శ్రీ కుంచాల రాంబాబు రెడ్డి అనువారు పర్మినెంట్ డీలర్గా నిర్వహిస్తున్న చౌక ధర దుకాణం నెంబరు.0757062 నందు ఈ మాసములో ఈరోజు వరకు మొత్తము 12 మంది కార్డుదారులకు మాత్రమే నిత్యావసర సరుకులు పంపిణీ జరిపి, ఈరోజు అనగా 04-01-026న అస్సలు పంపిణీ చేయనందున, సదరు దుకాణమును ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంలో….

. అచ్చట ఉండవలసిన బియ్యం నిల్వలు 12950 కేజీలకు గాను, 12150 కేజీలు మాత్రమే ఉన్నందున, అనగా 800 కేజీలు (8 క్వింటాళ్లు) బియ్యము తక్కువగా ఉండటాన్ని గమనించి, సదరు షాపుపై శ్రీయుత జిల్లా జాయింట్ కలెక్టర్ బాపట్ల వారి కోర్టులో కేసు నమోదు చేయుచు, సదరు  డీలర్ పై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకొనుటకు గాను శ్రీయుత రెవిన్యూ డివిజనల్ అధికారి, బాపట్ల వారికి నివేదిక సమర్పించడం అవుతున్నది.

ఈ సందర్భముగా డీలర్లు అందరికి మరొకసారి పత్రిక ముఖముగా తెలియజేయునది ఏమనగా…..
డీలర్లు అందరూ ప్రతి నెల ఒకటవ తేదీ నుండి 15వ తేదీ వరకు క్రమం తప్పకుండా సమయానికి అనగా ఉ.8 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు సా.4 గం నుండి రాత్రి 8 గం.ల వరకు కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయవలెను.

షాపు నందు ఉండవలసిన నిత్యావసర సరుకుల నిల్వలు లలో ఎట్టి పరిస్థితులలో వ్యత్యాసములు ఉండటానికి వీల్లేదు.
నిల్వలలో ఏదైనా వ్యత్యాసములు కనుగొనబడిని పక్షంలో… అట్టి డీలర్ పై తగు కేసులు తప్పక నమోదు చేయబడునని తెలియజేయడ మైనది.
ఈ తనిఖీలలో సి ఎస్ డి టి, బాపట్ల సివిల్ ఫణి కుమార్, బేతపూడి విఆర్ఓ ఎం. వలి బాబు తదితరులు పాల్గొన్నారు.

#Narendra

Exit mobile version