Home South Zone Andhra Pradesh రేపల్లె సబ్ డివిజన్‌లో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహణ – జిల్లా ఎస్పీ ఆదేశం

రేపల్లె సబ్ డివిజన్‌లో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహణ – జిల్లా ఎస్పీ ఆదేశం

0

జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించిన రేపల్లె సబ్ డివిజన్ పోలీసులు అమర్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపూడి గ్రామంలో కార్డాన్ అండ్ సెర్చ్ 29 వాహనాలు సీజ్ చేసిన పోలీసు అధికారులు
బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేర నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల కట్టడే ప్రధాన లక్ష్యంతో రేపల్లె డిఎస్పీ శ్రీ ఏ. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చుండూరు, రేపల్లె టౌన్, రేపల్లె రూరల్, వేమూరు సీఐలు శ్రీ ఆనంద్ బాబు, శ్రీ మల్లికార్జున రావు, శ్రీ సురేష్ బాబు, శ్రీ ఆంజనేయులు, అమర్తలూరు, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె టౌన్, చెరుకుపల్లి, నిజాంపట్నం, అడవులదీవి, నగరం పోలీస్ స్టేషన్‌లకు చెందిన ఎస్సైలు మరియు రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 55 మంది పోలీసు సిబ్బందితో కలిసి గురువారం తెల్లవారుజామున ఉదయం 04.00 గంటల నుండి ఉదయం 08.30 గంటల వరకు అమర్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపూడి గ్రామంలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్డాన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని మొత్తం 29 వాహనాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 26 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 కారు ఉన్నాయి.

అనంతరం రేపల్లె డిఎస్పీ గారు సదరు గ్రామ ప్రజలకు గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలను కలిగి ఉన్నా, విక్రయించినా లేదా సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన యెడల వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ గారికి లేదా డయల్ 112 వంటి టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version