స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో ఇండియా నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రయిల్స్ లో 88 కిలోల విభాగంలో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ తన ప్రతిభ చాటాడు.
చీరాల: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో ఇండియా నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రయిల్స్ లో 88 కిలోల విభాగంలో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ తన ప్రతిభ చాటాడు.తద్వారా ఫిబ్రవరి నెలలో చత్తీస్‌గఢ్ లోని రాయపూర్ లో జరిగే ఖేలో ఇండియా క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. ప్రేమ్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ తన గెలుపునకు కారణం తన కోచ్ దీనిష బాబు అని చెప్పారు.తన తల్లిదండ్రులు బాగా ప్రోత్సహిస్తుండడం వల్లే తాను రాణిస్తున్నట్లు తెలిపారు.గతంలో కూడా ప్రేమ్ సాగర్ అనేక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు.బ్యాంక్ ఆఫ్ బరోడా లో విధులు నిర్వర్తించే ప్రేమ్ సాగర్ తండ్రి ప్రవీణ్ కుమార్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు టెక్నికల్ ఆఫిషయల్ గా వ్యవహరిస్తుంటారు.ప్రేమ్ సాగర్ తల్లి దేవరకొండ స్వాతి చీరాల టిడిపి మహిళా విభాగం నాయకురాలు.
#Narendra
