Home South Zone Andhra Pradesh పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక |

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక |

0

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.
పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “77” ఫిర్యాదులు.*

ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 13.00 గంటల వరకు ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది.

ఈ నేపధ్యంలో ఈ రోజు ది.05.01.2026 వ తేదిన పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్.టీ.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్ గారి ఆదేశాలు మేరకు డి.సి.పి. శ్రీ ఎస్.వి.డి.ప్రసాద్ గారు, క్రైమ్ ఏ.డి.సి.పి. శ్రీ ఎం రాజారావు గార్లు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహించి బాధితులు నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం

77 ఫిర్యాదులపై భాదితులతో మాట్లాడటంతో పాటుగా, దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమైనది.

ఈరోజు అందిన ఫిర్యాదుల్లో భూవివాదాలకు, ఆస్తి వివాధాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 44, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 05, వివిధ మోసాలకు సంబంధించినవి 01, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 08, వివిధ సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 19 మొత్తం 77 ఫిర్యాదులును స్వీకరించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో డి.సి.పి. శ్రీ ఎస్.వి.డి.ప్రసాద్ గారు క్రైమ్ ఏ.డి.సి.పి శ్రీ ఎం రాజరువుగారు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించుటలో సహకారాన్ని అందించారు.

NO COMMENTS

Exit mobile version