తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో తీవ్రంగా స్పందించారు. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించారని, అందులో అసలు పాల ప్రమేయమే లేదని సిట్ (SIT) నివేదిక తేల్చిందని చెప్పారు.
హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు కులమతాలకు అతీతంగా ఖండించాలని, తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం ద్వారా గత ప్రభుత్వ పెద్దలు మరింత పాపానికి ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
