3వ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తపాలా శాఖ కవర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*
3వ ప్రపంచ తెలుగు మహాసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ…*
• సినిమా ఈవెంట్లకు వచ్చినట్టుగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు పెద్ద ఎత్తున జనం రావడం సంతోషం.
• మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే ప్రపంచ తెలుగు మహాసభలు.
• తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో వేదిక ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది.
• వందలాది భాషలు ఉన్నా… కేవలం ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించింది.. అందులో తెలుగు ఉండడం గర్వకారణం.
• ప్రపంచంలో 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు… ఈ సమావేశానికి కూడా 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం హర్షించదగ్గ విషయం.
• కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరధి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాష కోసం పని చేశారు… తెలుగు వైభవం చాటారు.
• వేమన, సుమతీ, భాస్కర పద్యాలు మరిచిపోలేం.
• పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం పెంచేలా చేయాలి… తెలుగు భాష ఎక్కడికీ పోదు… శాశ్వతంగా ఉంటుంది.
• అన్నమయ్య, వెంగమాంబ, మొల్ల వంటి వారు భక్తి మార్గంలోనూ తెలుగుకు వెలుగు తెచ్చారు.
• విశ్వనాధ సత్యనారాయణ, సినారె, రావూరి భరద్వాజ వంటివారికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి.
• తెలుగును గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషకు తెచ్చేందుకు గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని ఎన్నటికీ మరువలేం.
• నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం అని చాటిచెప్పిన ఎకైక నాయకుడు నందమూరి తారక రామారావు.
• తెలుగు వారిని మద్రాసీలని పిలిచే రోజుల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్.
• తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాడి మరణించిన అమరజీవి పొట్టిశ్రీరాములను మరువలేం.
• రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు… పదవిని త్యాగం చేసిన బూర్గుల కృష్ణారావు ఎప్పుడూ గుర్తుంటారు.
• ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు కృషి చేసిన రామోజీరావును తెలుగు జాతి మరువదు.
• తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలి.
• దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు మన తెలుగువాడే.
• మన భాష, యాస, సంధులు, సమాసాలు, సామెతలు, పొడుపు కథలు మనకే ప్రత్యేకం.
• అందుకే దేశ భాషలందు తెలుసు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయులు తెలుగు భాషను కీర్తించారు.
