Home South Zone Andhra Pradesh పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు : కలెక్టర్‌

పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు : కలెక్టర్‌

0

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులకు సూచించారు. సీఎం ఈనెల 7న పోలవరం పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద పర్యటన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ప్రతాప్‌ శివ కిశోర్‌తో కలిసి కలెక్టర్‌ సోమవారం పరిశీలించారు.
అనం తరం ప్రాజెక్టు సమావేశపు మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ సీఎం డయా ఫ్రంవాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను, గ్యాప్‌ 1,2 ప్రాంతాలను, వైబ్రో కాంపాక్షన్‌ పనులను పరిశీలిస్తార న్నారు. పనుల ప్రగతికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారులను నోడల్‌ అధికారులగా నియమిం చినట్టు తెలిపారు. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రైనీ ఐపీఎస్‌ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఆర్డీవో రమణ, ప్రాజెక్టు ఎస్‌ఈ రామచంద్రరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, మేఘా నిర్మాణ సంస్థ ప్రతినిధులు గంగాధర్‌, మురళి పమ్మి, జల వనరులశాఖ అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version