మంగళవారం పుంగనూరు మండలం, పాలెంపల్లి గ్రామ సమీపంలోని ఓ బావిలో వెంకటరమణ (46) అనే యువకుడి మృతదేహం కలకలం సృష్టించింది. చౌడేపల్లి మండలం కాగితి పంచాయతీ, పలగార్ల పల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.
# కొత్తూరు మురళి.
