Home South Zone Andhra Pradesh ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై మార్పులు రావాలి

ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై మార్పులు రావాలి

0

ఇంద్రకీలాద్రి, 06 జనవరి 2026

సెక్యూరిటీ సిబ్బంది పనితీరులో మార్పురావాలి

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో విధులు నిర్వర్టించే సెక్యూరిటీ సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించి గతంలో కంటే మెరుగ్గా పనిచేయాలని ఈవో శీనా నాయక్ అన్నారు.
ఈరోజు ఉదయం భక్తులతో ఎలా గౌరవంగా వ్యవహరించాలి అనే అంశంపై మహామంటపం 6వ అంతస్తులో జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, దూర ప్రాంతాల నుండి కష్టపడి వస్తుంటారు. అటువంటి భక్తులకు రక్షణగా ఉంటూనే, వారితో మర్యాదగా ప్రవర్తించడం భద్రతా సిబ్బంది బాధ్యత అని ఈవో పేర్కొన్నారు.
భక్తులను వినయపూర్వకమైన పలకరింపుతో
భక్తులు కనిపించగానే చిరునవ్వుతో, “నమస్కారం” లేదా “జై దుర్గా” అని పలకరించడం ద్వారా సానుకూల వాతావరణాన్ని కల్పించాలని,
వారితో మాట్లాడేటప్పుడు గౌరవంగా “అండి” అని, భవాని అని సంబోధించాలని ఈవో వివరించారు.

వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, మరియు చిన్న పిల్లలతో ఉన్న భక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారికి వీలైతే కూర్చునేందుకు లేదా క్యూ లైన్లలో ఇబ్బంది లేకుండా సహకరించాలని,
దర్శనం ఎటువైపు వెళ్లాలి, ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది వంటి సందేహాలను విసుగు చెందకుండా ఓపికగా సమాధానం చెప్పాలని ఈవో అన్నారు.

రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తులను తోయడం లేదా గట్టిగా అరుస్తూ భయపెట్టడం చేయకుండా
“దయచేసి ముందుకు జరగండి” లేదా “కొంచెం సహకరించండి” అని సున్నితంగా కోరుతూ,
సహనం మరియు నిగ్రహంతో ఉండాలని శీనా నాయక్ పేర్కొన్నారు.

కొందరు భక్తులు తెలియక తప్పులు చేయవచ్చు లేదా అసహనంగా ఉండవచ్చు. అటువంటి సమయంలో మీరు కోపాన్ని ప్రదర్శించకుండా, శాంతంగా పరిస్థితిని వివరించాలని,
సిబ్బంది ధరించే యూనిఫాం దేవస్థానం యొక్క ప్రతిష్టకు చిహ్నం అని గుర్తుంచుకోవాలని ఈవో వివరించారు.
భక్తులే దేవుళ్లు. వారికి చేసే సేవ అమ్మవారికి చేసే సేవతో సమానం. సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తన వల్ల భక్తులు ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు మంచి అనుభూతిని తీసుకువెళ్లేలా అందరూ పని చేయాలని అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version