తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం వారు పంపిన ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 66 మంది యూనిట్, బూత్ ఇంచార్జీలకు నా చేతుల మీదుగా అందజేయడం ఎంతో గర్వంగా అనిపించింది.
నిర్విరామంగా తెలుగుదేశం జెండాను మోస్తూ, పార్టీ విలువలను కాపాడుకుంటూ, సమాజ సేవనే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు ఈ గుర్తింపు దక్కడం నిజంగా అభినందనీయం. పని చేయడమే కాదు… ఆ పనికి తగిన గుర్తింపు వచ్చినప్పుడే ఆ సేవకు సార్థకత లభిస్తుందని నేను గట్టిగా నమ్ముతాను.
ఈ ప్రశంస పత్రాలు పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రావడం, అందులో గుంటూరు పశ్చిమం నుంచి ఎక్కువ శాతం రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది.
“గుంటూరు వెస్ట్ – ఆల్వేస్ బెస్ట్” అన్నది మరోసారి రుజువైంది.
ఈసారి ప్రశంస పత్రాలు అందుకోని వారు ఉత్తమ కార్యకర్తలు కాదనే భావన ఏమాత్రం లేదు. తెలుగుదేశం పార్టీ జెండా కిందకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఉత్తమ కార్యకర్తలే. ‘తొలి అడుగు’ కార్యక్రమంలో చెప్పిన అంశాలను ప్రజల వరకు సమర్థవంతంగా తీసుకెళ్లిన వారికే ఈసారి గుర్తింపు లభించింది.
ఈరోజు ఉత్తమ కార్యకర్తలుగా గుర్తింపు పొందిన వారిపై ఇకపై రెట్టింపు బాధ్యత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే కాదు, ప్రతి రోజూ మన ప్రవర్తనతో, మాటలతో, పార్టీ విలువలను ప్రజలకి చాటిచెప్పాల్సిన అవసరం ఉంది.
మనమంతా ఒక కుటుంబంలా, ఎలాంటి విభేదాలు లేకుండా, ఐకమత్యంతో ముందుకు సాగాలి. అదే ఐకమత్యం గుంటూరు పశ్చిమాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది.
పార్టీ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ… ప్రజాసేవలో మన ప్రయాణం ఇలాగే కొనసాగుదాం.