గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యలను నాపై నమ్మకంతో నేరుగా తెలియజేశారు.
ఈ మహిళా గ్రీవెన్స్‌ను పూర్తిగా ఓపెన్ వేదికగా నిర్వహిస్తూ, ప్రతి మహిళకు ధైర్యంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం. వచ్చిన ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో వింటూ,
సాధ్యమైన పరిష్కారాలు
అవసరమైన పనులు
సంబంధిత అధికారులతో ఫాలోఅప్స్
తక్షణమే చేపడుతున్నాం.
మహిళల సమస్యలు పరిష్కరించి, వారి ముఖాల్లో ఆనందం చూడడమే మా లక్ష్యం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి మహిళ
సమస్యల నుంచి విముక్తంగా,
ఆర్థికంగా బలంగా, గౌరవంగా.
స్వావలంబనతో ముందుకు సాగాలి అనే సత్సంకల్పంతోనే ఈ మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాం.
మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
