Home South Zone Andhra Pradesh నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థి భర్తీ చేయాలి గిరిజన ప్రజా సంఘాలు

నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థి భర్తీ చేయాలి గిరిజన ప్రజా సంఘాలు

0

*నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థినికి భర్తీ చేయాలి – గిరిజన ప్రజా సంఘాల జేఏసీ*

విజయవాడ: కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తుందని గిరిజన ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షులు మానుపాటి నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన గిరిజనుల తలరాతలు మారడం లేదన్నారు. రాజ్యాంగంలో ఎస్టీలకు ఇచ్చిన హక్కులకు ప్రభుత్వాలు గండి కొడుతున్నాయన్నారు.

నెల్లూరులో మేయర్ పదవి ఎస్టీకి రాజ్యాంగబద్ధంగా కేటాయించబడిందని, గత ప్రభుత్వంలో గిరిజన మహిళ మేయర్ పదవిలో కొనసాగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో గిరిజన మహిళపై దాడుల నేపథ్యంలో రాజీనామా చేస్తే ఇంతవరకు మేయర్ పదవిని కుట్రపూరితంగానే భర్తీ చేయలేదన్నారు.

వెంటనే కూటమి ప్రభుత్వం ఎస్టీ అభ్యర్థితో మేయర్ పదవిని భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గిరిజనుల పై దాడులు ఆపాలన్నారు. లేకుంటే గిరిజన సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏ.వై.హెచ్.పి.ఎస్ జాతీయ అధ్యక్షులు ఎన్.ధర్మ, జేఏసీ నేతలు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version