పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల ఎస్సై రమేష్, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్లను ధరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమల మండలంలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాల వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతోందని, వేగం కన్నా ప్రాణమే మిన్న అని గుర్తుంచుకుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఆయన తెలిపారు
#కొత్తూరు మురళి.
