Home South Zone Telangana రూ.50 వేల లంచంతో తహసీల్దార్ పట్టివేత |

రూ.50 వేల లంచంతో తహసీల్దార్ పట్టివేత |

0

*రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం*

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండల తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.

ఫిర్యాదుధారుని నాన్న గారి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని, ఫిర్యాదుధారుని పేరు మీద రికార్డులు మార్పు చేయడానికి అనుకూలంగా సంబంధిత అధికారులకు నివేదిక పంపేందుకు తహసీల్దార్ శ్రీనివాసరావు రూ.50,000/- లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లంచం మొత్తాన్ని ఒక ప్రైవేటు వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ సహాయంతో స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సమాచారం అందుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు ముందస్తుగా వల వేసి, లంచం లావాదేవీ జరుగుతున్న సమయంలో దాడి చేసి తహసీల్దార్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ప్రభుత్వ సేవల కోసం లంచం అడిగే ఏ ప్రభుత్వ ఉద్యోగిపై అయినా కఠిన చర్యలు తప్పవని ఏసీబీ హెచ్చరించింది.
#sandeep

NO COMMENTS

Exit mobile version