ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ‘రైతు భరోసా’ నిధుల విడుదల, అర్హతలపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
