మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ ల్లో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2024లో ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఎంపీ ఈటెల రాజేందర్ నాయకత్వంలో అనేక కీలక అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.
ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్న అభివృద్ధి పనులను పక్కనపెట్టి, ఇతర పార్టీల ప్రతినిధులు ముఖ్యంగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కౌన్సిల్ సమావేశాల్లో “మేమే చేశాం” అంటూ అవాస్తవ ప్రచారం చేయడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి వరకు, సనత్‌నగర్ నుంచి సఫిల్ గూడ వరకు ఉన్న రెండు ప్రధాన రైల్వే గేట్ల సమస్యల పరిష్కారానికి ఎంపీ ఈటెల రాజేందర్.. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తో పలుమార్లు చర్చించి, అధికారులను సమన్వయం చేసుకుని రైల్వే మేనేజర్లతో సమావేశాలు నిర్వహించి పనులు ప్రారంభించారని తెలిపారు.
ఎన్నోయేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు తీసుకున్న ఈ చర్యలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.
అలాగే గతంలో ఎంపీ ఈటెల రాజేందర్ చొరవతో ప్రారంభమైన రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ఇప్పుడు ఇతరులు తమవిగా చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడమేనని బీజేపీ నాయకులు ఆరోపించారు.
అల్వాల్ డివిజన్ 133 పరిధిలోని కొకూర్ బర్షపేట్, మచ్చ బొల్లారం ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఎంపీ ఈటెల రాజేందర్ హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసి, కొత్త వాటర్ పైప్‌లైన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.
ఈ పనులకు సుమారు 7.50 లక్షల వ్యయం అవుతుందని వెల్లడించారు.
అదేవిధంగా ఎంపీ లాడ్స్ నిధుల కింద అల్వాల్ ప్రాంతంలో 42 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు మరియు పార్కు అభివృద్ధి పనులకు పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
మేము అభివృద్ధి పనులు చేసాము. ఈ విషయం పై ఎవరితో నైనా చర్చకు సిద్ధమన్నారు.
ఒక ఎంఎల్ఏ గా వున్న మర్రి రాజశేఖర్ రెడ్డి ఏరోజు అయిన అభివృద్ధి పనుల గురించి ఎంపి ని కలిసి చర్చించిన సందర్భం ఏది లేదని, అభివృద్ధి విషయం పై ఎంఎల్ఏ శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు.
ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఎంపీ ఈటెల రాజేందర్ నిరంతరం పనిచేస్తున్నారని, అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మే విదంగా లేరని అది వారు తెలుసుకోవాలన్నారు.
ఈ మీడియా సమావేశం లో బీజేపీ అల్వాల్ సర్కిల్ నాయకులు చింతల మాణిక్ రెడ్డి,మల్లికార్జున్ గౌడ్ మల్కాజ్గిరి అసెంబ్లీ కో కన్వీనర్,అజయ్ రెడ్డి 133 డివిజన్ అధ్యక్షుడు,కార్తీక్ గౌడ్ 134 డివిజన్ అధ్యక్షులు,శ్రీధర్ రెడ్డి 135 డివిజన్ అధ్యక్షులు, అజిత్ సాయి, గోపి,పాల్గొన్నారు.
Development. The facts
#sidhumaroju
