ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు
అమ్మవారి దర్శనం.
నేడు ఉదయం విజయవాడ చేరుకున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంద్రకీలాద్రికి చేరుకోగా, ఆలయ అధికారులు మరియు అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజేంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేదాశీర్వచనం: దర్శనం అనంతరం ఆలయ మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. ఆలయ మర్యాదలతో రాజేంద్ర ప్రసాద్‌కు శేష వస్త్రాన్ని కప్పి గౌరవించారు.
తీర్థ ప్రసాదాలు: ఆలయ అధికారులు అమ్మవారి, ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు.
