ప్రభుత్వ సేవలు ప్రజలకు సజావుగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
బాపట్ల: ప్రభుత్వ సేవలు ప్రజలకు సజావుగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు అన్నారు.
గురువారం చీరాల మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయాన్ని ఆయన అకస్మాత్తుగా తనిఖీ చేసి, వాహన్–సారథి పోర్టల్స్ ద్వారా అందుతున్న సేవల అమలును పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ రీన్యువల్స్‌ను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
కార్యాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అలాగే మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రజలు ఆన్‌లైన్ సేవలను నేరుగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
#Narednra
