కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
బాపట్ల జిల్లా: కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ గుర్తించలేని సందర్భాలను హిట్ అండ్ రన్ కేసులుగా పరిగణిస్తారని తెలిపారు.
ఇటువంటి ప్రమాదాలలో మరణించిన లేదా గాయపడిన బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బాధితుడికి పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య, అవి ఏ దశలో పెండింగ్‌లో ఉన్నాయన్న అంశాలను కలెక్టర్ సమీక్షించి, పరిహారం మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.
#Narendra
