మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్ కు భార్య చింతల జ్యోతి హత్య కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య జీవిత ఖైదు విధించారు.
పదేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఇమ్రాన్, భార్యపై అనుమానంతో నిత్యం మద్యం సేవించి ఆమెను కొట్టేవాడు. 2023 ఫిబ్రవరిలో తీవ్రంగా గాయపరచడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించడంతో ఈ తీర్పు వెలువడింది.
