రాజకీయాలు పక్కనపెట్టి… అందరం కలిసి పనిచేస్తూ బాగుపడదాం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
చిత్రం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే…
అర్జీలు అందించిన ప్రజలు….పి.జే.ఆర్.ఎస్ లో నమోదు
గుడివాడ అభివృద్ధి కోసం అన్ని వదిలేసి వచ్చాను…. నా సేవలను ప్రజలందరూ వినియోగించుకోవచ్చు*
గ్రామాల్లో మంచి చేస్తే ఆపే సంస్కృతిని… మానుకోండి
అభివృద్ధి కోసం కలిసి ముందుకు వస్తే అభినందిస్తాను…
రాజకీయాల కంటే మనందరికీ అభివృద్ధి ముఖ్యం కావాలి….
గుడ్లవల్లేరు జనవరి 12: రాజకీయాలను పక్కనపెట్టి నియోజకవర్గంలోని అందరం కలిసి పనిచేస్తూ బాగుపడదామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు.గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకే చిత్తశుద్ధితో పనిచేస్తున్నానన్నారు.
గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి…సమస్యలు తెలుసుకున్నారు.అర్జీలు అందించేందుకు చిత్రం పరిసర గ్రామాల ప్రజలు పోటెత్తారు.ప్రజల నుండి సమస్యల అర్జీలను అందుకున్న ఎమ్మెల్యే… సంబంధిత అధికారులతో మాట్లాడి పలు సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ప్రభుత్వ పాలసీ, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి కొంత ఆలస్యం అవుతుందని కచ్చితంగా వాటిని కూడా పరిష్కరిస్తానని అర్జీలు అందించిన వారికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు.
అనంతరం గ్రామస్తులు ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…..నమ్మి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శక్తివంతం లేకుండా పనిచేస్తున్నానన్నారు. ప్రజలతో కలిసి నడుస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల వరకే పార్టీలనీ తర్వాత అందరిని ప్రజలు గానే భావిస్తానని పేర్కొన్నారు. ఒక మంచి కోసం పనిచేస్తే ఆపే సంస్కృతిని మానుకోవాలని, ఇప్పటికీ ఈ సంస్కృతి కొన్ని గ్రామాల్లో ఉండడం బాధాకరమన్నారు.అభివృద్ధి కోసం ముందుకు వచ్చి పని చేసే ప్రతి గ్రామాన్ని అన్నారు. రాజకీయాల కంటే మనందరికీ అభివృద్ధి ముఖ్యం కావాలని పిలుపునిచ్చారు. అన్ని వదిలేసి ప్రజల కోసం వచ్చానని, అందరికీ అందుబాటులో ఉంటానని నా సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.
అనంతరం కృష్ణాజిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికైన మండల తాసిల్దార్ లోకరాజును అభినందించిన ఎమ్మెల్యే రాము ఆయనను
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, కార్పొరేషన్ డైరెక్టర్ సాయన పుష్పావతి,DC ఆంజనేయులు, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, పోలవరపు వెంకటరావు, వెనిగళ్ళ నాగేశ్వరరావు, చాపరాల బాలాజీ, కొడాలి రామరాజు, బొర్రా నాగేశ్వరరావు, పెన్నేరు రమేష్, మన్యం నరసింహారావు, తోట మల్లికార్జునరావు, పరదామయ్య,వాసు, అట్లూరు స్వరూప్, ధనకోటి, దివ్య చౌదరి, *గ్రామ నాయకులు* పార్టీ ప్రెసిడెంట్ మల్లా వెంకట రామారావు, గోపూ సాంబశివరావు, పాగోలు శ్యామ్ బాబు, బొప్ప సత్యనారాయణ, సందీప్ శామ్యూల్, నాని, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
