ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. మూడు రోజుల పండుగలో మొదటి రోజు అయిన బుధవారం పుంగనూరు నియోజకవర్గంలో భోగి పండుగను జరుపుకుంటున్నారు.
తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేశారు. భోగి పండుగ రోజు పలు విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరుతాయని పెద్దలు ఆ కాలం నుంచి చెబుతున్నారు# కొత్తూరు మురళి.
