ఎమ్మెల్యే సుజనా చౌదరి గోసేవ..
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గుంటూరు జిల్లాలోని పెద వడ్లపూడి లోని గోశాల ను సందర్శించారు. బిజెపి నాయకుడు పాతూరి నాగభూషణం కి చెందిన గోశాల లో సుజనా చౌదరి గోమాతలకు ఆహారం పెట్టారు.. అదే విధంగా గోవులకు పూజ నీర్వహించారు.. వివిధ రకాల కూరగాయలు, పండ్లు.
చిరు ధాన్యాలు సుజనా చౌదరి ఆవులకు ఆహారంగా అందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులను పూజించడం మాహా పుణ్య కార్యంగా తీసుకోవాలన్నారు.. గోసేవ చేయడం గోవిందుడు సేవగా భావించాలన్నారు.. గోవుకు సంబంధించిన ఉత్పత్తులన్నీ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యానిస్తాయని తెలిపారు..
ఇన్ని ఆవుల కు పోషణ ఇస్తూ పాతూరి నాగభూషణం మానవత్వం చాటుకుంటున్నారని కొనియాడారు.. కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, , బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు..
