మేడారం సమ్మక్క–సారక్క గద్దెను దర్శించుకున్న కేశినేని నాని గారు
ములుగు జిల్లా మేడారం లోని ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క–సారక్క గద్దెను ఈ రోజు మాజీ ఎంపీ శ్రీ కేశినేని నాని గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా అమ్మవార్లకు బెల్లం తులాభారం సమర్పించి, అనంతరం గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారక్క అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి–సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
ఆలయానికి వచ్చిన కేశినేని నాని గారికి ఆలయ అధికారులు సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా కేశినేని నాని గారు మాట్లాడుతూ, సమ్మక్క–సారక్క జాతర గిరిజన సంస్కృతి, ఆచారాలకు ప్రతీకగా నిలిచిందని, దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా విశేష ఖ్యాతి పొందిందని పేర్కొన్నారు.
అలాగే మేడారం జాతర నిర్వహణతో పాటు ఆలయ అభివృద్ధి కోసం నా ఆత్మీయ మిత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గ్రామీణ అభివృద్ధి,పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరాల, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు ఎంతో చక్కగా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని తెలిపారు. గిరిజన సంప్రదాయాలు, వారి ఆధ్యాత్మిక విశ్వాసాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.*
