పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం యర్రాతివారి పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ఇరుముడి చెల్లించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయన ఇరుముడి కట్టుకొని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.
ఆయనతోపాటు ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పెద్ద సంఖ్యలో స్వాములు ఇరుముడులతో ఆలయాన్ని దర్శించారు. నేటి సాయంత్రం మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది# కొత్తూరు మురళి.
