Home South Zone Andhra Pradesh అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్, 65 చోట్ల దొంగతనాలు |

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్, 65 చోట్ల దొంగతనాలు |

0

పగటిపూట ఇంటి నేరాలు చేసే అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 65 చోట్ల దొంగతనాలకు పాల్పడిన నిందితుడు

చీరాల: పగటిపూట ఇంటి నేరాలు చేసే అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 65 చోట్ల దొంగతనాలకు పాల్పడిన నిందితుడు

నిందితుడు నుండి రూ.20,67,000/- విలువ గల 159 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20,000/- విలువ గల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

స్వల్ప కాలంలోనే ముద్దాయిని అరెస్ట్ చేసి దొంగిలించబడిన సొత్తును రికవరీ చేసిన చీరాల 1 టౌన్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర ఐపీఎస్ గారు

కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన చీరాల డిఎస్పి ఎండి.మోయిన్ గారు

చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెపాల్ కాలనీ నందు జరిగిన పగటిపూట ఇంటి దొంగతనం కేసులో బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల డిఎస్పి ఎండి.మోయిన్ గారి నేతృత్వంలో చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారి సారధ్యంలో ప్రత్యేక బంధాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరం జరిగిన నెల రోజుల్లోపే ముద్దాయిని అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనపరుచుకోవడం జరిగింది. కేసు వివరాలను చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చీరాల డిఎస్పి ఎండి మోయిన్ గారు వెల్లడించారు.

నేర సంఖ్య:
265/2025 u/s 331 (3), 305 (a) BNS of చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్

నేరం జరిగిన తేది:
ది.19.12.2025వ తేదీన ఉదయం 11.00 గంటల నుండి 12.30 గంటల మద్య

నేరము జరిగిన స్థలము:
కెపాల్ కాలనీ, దేశాయిపేట పంచాయతీ, వేటపాలెం మండలం.

పిర్యాది వివరాలు:
పుట్ట ఫణి రాజా, w/o కోటి రెడ్డి, 34 సంవత్సరాలు, కులం రెడ్డి, కాపోల్ కాలనీ, దేశాయిపేట పంచాయతీ, వేటపాలెం మండలం.

ముద్దాయి వివరాలు:
రంగనాధం కిరణ్ s/o ఉమాపతి, 32 సంవత్సరాలు, గూడూరు పట్టణం, నెల్లూరు జిల్లా నివాసం.

స్వాదీన పరచుకున్న సొత్తు:

1. చీరాల ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ కేసులో 15 గ్రాముల బరువుగల 2 రింగులు, ఒక చైన్ మరియు బంగారు నగలు కరిగించగా వచ్చిన 60 గ్రాముల బంగారు ముక్క

2. సిద్దవట్టం పోలీసు స్టేషన్ కేసులోని బంగారు నగలు కరిగించగా వచ్చిన 59 గ్రాముల బంగారు ముక్క.

3. రేపల్లె టౌన్ పోలీసు స్టేషన్ కేసులోని బంగారు నగలు కరిగించగా వచ్చిన 25 గ్రాముల బంగారు ముక్క.

4. గిద్దలూరు కేసుకు సంబంధించిన రూ.20,000/- నగదు

మొత్తము: 159 గ్రాముల బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ రూ.20,67,000/-, కాష్ Rs.20,000/-.

ది:19.12.2025 వ తేదీన ఉదయం 11.00 గంటలకు ఫిర్యాది తన ఇంటికి తాళం వేసి, హాస్పిటల్‌కు వెళ్లి సుమారు 12.30 గంటలకు తిరిగి వచ్చినప్పుడు, తన ఇంటి తాళం మరియు లాకర్ తలుపులు పగలగొట్టి సుమారు రూ.2,30,000/- విలువగల 15 సవర్ల బంగారు ఆభరణాలు, మరియు సీసీ కెమెరా బాక్స్ కనిపించకుండా పోయినవని, గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులకొట్టి, ఇంట్లో ప్రవేచించి మొత్తం రూ. 2,30,000/- విలువైన 15 సవర్ల బంగారం దొంగలించారని, ఫిర్యాదు చేసినారు.

పగటిపూట ఇంటి దొంగతనం కేసును ప్రత్యేకంగా పరిగణించిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు చీరాల డిఎస్పి ఎండి.మోయిన్ గారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ముద్దాయిని గుర్తించి సరైన సమాచారం ద్వారా ది:16.01.2026 వ తేది న 07:30 గంటల సమయంలో, చీరాల రైల్వే స్టేషన్ వెనుక ప్రాంతంలో ముద్దాయి ఉన్నట్లు సమాచారం మేరకు చీరాల వన్ టౌన్ WSI అయిన G. రాజ్యలక్ష్మి గారు తన సిబ్బంది సహాయంతో, ముద్దాయిని దొంగిలించిన సొత్తుతో సహా పట్టుకున్నారు.

ముద్దాయి పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 65 దొంగతనం కేసులు నమోదై ఉన్నవి. ఇతను పగలు సమయంలో ఇంటి దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తుడు. ముద్దాయి గతంలో చీపురుల వ్యాపారం చేస్తూ వివిధ గ్రామాలు, పట్టణాలు తిరగడం వల్ల దొంగతనాలు చేయడం అతనికి బాగా అలవాటైంది. ఈ క్రమంలోనే చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ది. 19.12.2025వ తేదీన దొంగతనానికి పాల్పడ్డాడు.

అదేవిధంగా, 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారంలో రేపల్లె పట్టణంలో, 2025 నవంబర్ 11న కడప జిల్లా, సిద్ధవటం మండలం, నలందా నగర్‌లో దొంగతనాలకు పాల్పడ్డాడు.

ఈ నేరం జరిగిన అతి తక్కువ సమయంలోనే ముద్దాయిలను పట్టుకొని, వారి వద్ద నుండి దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయడంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సమర్థవంతంగా విధులు నిర్వహించిన చీరాల ఎస్డీపీఓ ఎండి. మోయిన్ గారిని, చీరాల వన్ టౌన్ సీఐ ఎస్. సుబ్బారావు గారిని, డబ్ల్యుఎస్సై జి.రాజ్యలక్ష్మి గారిని, చీరాల వన్ టౌన్ పోలీస్ సిబ్బందిని మరియు చీరాల సబ్ డివిజన్ ఐడి పార్టీ సిబ్బంది ఏఎస్సై పి. నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ లు టి. శ్రీనివాసరావు, బి. అచ్చయ్య, జి. ప్రసాద్, పోలీస్ కానిస్టేబుల్ బి.బాలచంద్రలను బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

NO COMMENTS

Exit mobile version