ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిపి షేక్ షరీన్ బేగం సమీక్షించారు.హైదరాబాదు నుండి లక్షకి పైగా వాహనాలు విజయవాడ వైపు వచ్చినట్లు అంచనా,ఇప్పటివరకు సుమారు 50 వేలకు పైగా వాహనాలు తిరుగు ప్రయాణం అయ్యాయని ఆమె తెలిపారు
.ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి చర్యలు చేపట్టామని తెలిపారు.ఇబ్రహీంపట్నం వద్ద నాలుగు లైన్లుగా వెళ్లాల్సిన ట్రాఫిక్ బ్రిడ్జిల కారణంగా కేవలం రెండు లైన్లు గా వెళ్ళటంతో రింగ్ సెంటర్లో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. పోలీసు సిబ్బంది అంతా పూర్తి అప్రమత్తతతో ట్రాఫిక్ కంట్రోల్ చేసామని తెలిపారు.అందరూ క్షేమంగా ఇళ్లకు చేరడానికి ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.సహకరించిన ప్రతి ఒక్కరికీ ట్రాఫిక్ డిసిపి షేక్ షరీన్ బేగం ధన్యవాదాలు తెలియజేశారు.
