అమరావతి
గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి
పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయి
*ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోంది*
*చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కి జగన్ నేతృత్వంలోని వైసీపీ కి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసు*
*అరాచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ*
*గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పని చేసే లక్ష్యం తో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది*
*ప్రజలు 11సీట్లకు పరిమితం చేసినా వైసీపీకి బుద్ది రాలేదు*
*ఎక్కడ ఎవరు చనిపోయినా శవ రాజకీయాల కోసం పాకులాడుతూ ప్రజల్ని మభ్య పెట్టాలని వైసీపీ చూస్తోంది*
*పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజలు బాగుపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు*
*అక్రమ సంపాదన మీద పుట్టిన వైసీపీకి, తెలుగువాడి అత్మగౌరవం కోసం పెట్టిన తెలుగుదేశం కి మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసు*
*గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా కఠినంగా అణచివేసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే లక్ష్యంతో వ్యవహరించిన నాయకుడు చంద్రబాబు*
*అధికారంలో ఉన్న 5ఏళ్ళు జగన్ పల్నాడు లో హింసను ప్రేరేపించాడు*
*పల్నాడు లో తెలుగుదేశం నేతల పరామర్శకు చంద్రబాబు వెళ్లకుండా ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టారు*
*యరపతినేని నియోజకవర్గం పిన్నెలి గ్రామంలో 300మంది ఊరు విడిచి వెళ్లిపోయేలా చేశారు*
*ఒక్క గురజాల నియోజకవర్గంలోనే ఎస్సీ, బీసీలను 12మందిని చంపేశారు*
*అక్రమ మైనింగ్ గుంటల్లో పిల్లలు చనిపోతే ఎవ్వరూ పట్టించుకోలేదు*
*హత్యా రాజకీయాలు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తప్పు చేసిన ఎవర్నీ వదిలిపెట్టదు*
*వ్యక్తిగత హత్యల్ని రాజకీయ హత్యలుగా మార్చే కుట్రలు ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు*
